Monday | అమ్మో.. ఆఫీస్ కా..?

Monday | అమ్మో.. ఆఫీస్ కా..?

  • వారం ఉత్సాహంతో మొదలు కావాలి కానీ…
  • తప్పని విధినిర్వహణ..
  • ప్రాణాలే పణంగా ప్రయాణాలు..
  • ప్రమాదాలకు కారణాలు..
  • Monday | చాలా మందికి సోమ, మంగళవారాల్లో.. అమ్మో ఆఫీస్ కి వెళ్లాలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆఫీస్ లో కొంత మంది వర్క్ ఎక్కువుగా ఉంటుందని.. టెన్షన్ ఫీలవుతుంటారు. మరి కొంత మంది.. ఆఫీస్ లో బాస్ తిడతారేమో అని ఫీలవుతుంటారు. కొంత మందికి అయితే.. ఆఫీస్ కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటుంది కదా అనుకుంటారు.

వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇది మధ్యతరగతి ఉద్యోగస్థుల మనోవ్యధ. అయితే.. సోమ, మంగళ వారాల్లో ఆఫీస్ కి వెళ్లాలా అని ఫీలవ్వడానికి కారణం వెనుకున్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం. పట్టణాల్లో వారమంతా కష్టపడి ఉద్యోగాలు చేసుకునే వారికీ, కాలేజీలూ స్కూల్స్ లో చదువుకునే వారికీ, ఆదివారం ఆటవిడుపు. పట్టణాలకు దగ్గరగా ఉండే తమ ఊళ్ళకు వారాంతంలో రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఆదివారానికి ముందు మరో ఒకట్రెండు రోజులు సెలవులొస్తే మరీ ఉత్సాహంగా తమ పల్లెటూళ్ళకు వెళ్ళిపోతుంటారు. సెలవులన్నీ (Holidays) సంతోషంగా గడిపేసాక తిరిగి విధులకు హాజరయ్యేందుకు తిరిగొచ్చేది సోమవారమే.

Monday | అసలు కథ ఇక్కడే ఆరంభం


వారం మొదట్లో సెలవులివ్వడానికి ఏ కార్యాలయాలూ, విద్యాసంస్థలూ ఒప్పుకోవు. తప్పనిసరిగా అందరూ హాజరు కావాల్సిందే. అందుకే పొద్దున్నే లేచి తయారై దొరికిన బస్సో, ప్రైవేటు వాహనమో పట్టుకుని క్రిక్కిరిసో, వేలాడుతూనో సమయానికి చేరుకోవాలనే ఆత్రంలో ఉంటారు ప్రతి ఒక్కరూ. ఆ ఆరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గమ్యం చేరుకోవడమే ప్రధానంగా ప్రయాణాలు (Journey) మొదలు పెడుతుంటారు. సొంతవాహనాలు లేనివారికి, ఎంతంటే అంత ప్రయాణ ఖర్చులు పెట్టుకోలేని వారికీ, ఆర్టీసీ బస్సులూ, చిన్న చిన్న ప్రైవేటు వాహనాలూ, షేరింగ్ ఆటోలే దిక్కు.

Monday

Monday | వీరి ఆత్రమే వారికి ఆదాయం


ఎలాగోలా సమయానికి చేరుకోవాలన్న జనం తొందరను, టెన్షన్ ను ప్రైవేటు వాహనాల వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దాంతో వాహనాలు బ్యాలెన్స్ ఉండక అదుపు తప్పి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల కంకర లారీ ఢీకొనడంతో ప్రమాదానికి (Accident) గురైన బస్సులో కూడా కెపాసిటీని మించి ప్రయాణికులు ఉన్నట్టు తేలింది.

Monday | సిటీలో కూడా గగనమే


మహానగరాల్లోనూ సోమవారం ఉదయం ప్రయాణం గగనమే. బస్సులూ ఎం.ఎం.టీ.సీ. రైళ్ళూ అడుగుపెట్టేందుకు వీలుండవు. సర్వీసులు ప్రజల అవసరానికి సరిపడా ఉండవు. క్యాబ్ లు, బైక్ లు తొందరగా బుక్ కావు. ఈ పరిస్థితి మధ్యాహ్నం దాకా తప్పట్లేదు. బుక్ అయినా అధికంగా వసూలు చేసే పరిస్థితి..చెల్లించుకుంటేనే గానీ గమ్యాలకు చేరుకోలేని పరిస్థితి.

Monday | మెట్రోల పరిస్థితేమిటి?


మెట్రోలలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ ఉండట్లేదు పరిస్థితి. హైదరామాద్ లో అమీర్ పెట్ (Ameerpet) నుంచి హైటెక్ సిటీవైపు వెళ్ళే మెట్రోలైతే, ఒక్కొక్కసారి నాలుగైదు రైళ్ళు వదిలేసి వేచి చూసినా కాలు పెట్టేందుకు వీలు లేను పరిస్థితి. ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగు పర్చడం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ట్రాఫికి పోలీసులు పర్యవేక్షించి జాం అవకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాత్రమే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Monday | మెరుగైన రవాణానే కీలకం


ఎవరికీ ఉన్నచోటునే విద్య, ఉపాధి అవకాశాలు ఉండవు. తప్పనిసరిగా ఉన్నచోటు నుంచి మరో చోటుకి తరలి పోవాల్సిందే సరైన సమయంలో గమ్యాలకు చేరుకోవాల్సిందే. అలాగైతేనే అవకాశాలు అందుకోగలుగుతారు. ఆదాయం పొందగలుగుతారు. ఒకచోతి నుంచి మరోచోటికి రవాణా సౌకర్యాలు ఎంత మెరుగుపడితే అంతగా ప్రజల జీవన ప్రమాణాలూ మెరుగు పడతాయి. సంపద పెరుగుతుంది. దారులున్నంత మాత్రాన సరిపోదు. ప్రయాణ సౌకర్యాలూ మెరుగుపడాలి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రజలు సురక్షితంగా గమ్యాలకు చేరుకునే విధంగా వివిధ మార్గాల్లో ఎంత సులువుగా, వేగంగా ప్రయాణాలు కొనసాగితే ఆయా ప్రదేశాల్లోని వ్యాపార వాణిజ్య అవకాశాలు మెరుగుపడి ఆయా రంగాలు అభివృద్ధి చెందుతాయి.

ఇప్పుడు అర్థమైంది కదా.. ఆఫీస్ కి వెళ్లాలంటే.. జర్నీ చేయాలి. రోడ్డు, రవాణా వ్యవస్థ, సౌకర్యాలు సరిగా లేవు. అందుచేత ఈ జర్నీల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనే టెన్షన్ కూడా మొదలైంది. ఆఫీస్ లో ఉండే టెన్షన్ తో పాటు ఈ టెన్షన్ కూడా తోడైంది. అందుకనే ఇప్పుడు ప్రయాణాలు చేయాలన్నా.. ఆఫీస్ కి వెళ్లాలి అన్నా.. తెగ టెన్షన్ పడుతున్నారు. మరి.. ప్రభుత్వాలు భద్రత పై మరింత ఫోకస్ పెడితే.. మంచిది.

To Read More Articles, Latest News, Please Click Here

To Read This Article, Please Click Here ఎర్ర బంగారం  స్మగ్లింగ్

Leave a Reply