100 Days | ఐటీడీఏ పల్స్ యాప్ శ్రీకారం

100 Days | ఐటీడీఏ పల్స్ యాప్ శ్రీకారం
100 Days | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల పర్యవేక్షణకు పల్స్ యాప్(Pulse app) నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఉట్నూర్ ఐటిడిఏ పిఓ యువరాజ్ మర్మాట్(ITDA PO Yuvraj Marmat) పేర్కొన్నారు, మంగళవారం ఉట్నూర్ కేబీ ఈ రోజు కాంప్లెక్స్ లోని పీఎంఆర్సి భవనం యందు ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల వసతి గృహ అధికారులు ఏటిడిలతో సమావేశంలో పర్యవేక్షణ యాప్ ఐటీడీఏ పల్స్(App ITDA Pulse) ను ఆవిష్కరించారు.
ఆశ్రమ పాఠశాలలో అందిస్తున్న రోజువారి మెనూ వివరాలతో ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న భోజనం వివరాలు, ఉపాధ్యాయుల పనితీరు తరగతి గదుల బోధనా అంశాలు తెలుసుకోవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు, వచ్చేవారం నుండి అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని పదవ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల(100 days) ప్రత్యేక కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని ప్రతి విద్యార్థి పై దృష్టి సారించాలని కోరారు.
విద్యార్థులకు శుద్ధ జలము త్రాగుటకు అందించే విధంగా ఆరో ప్లాంట్ ద్వారా అందించాలని పనిచేయని వాటికి వెంటనే మరమ్మత్తులు చేయాలని విద్యార్థులకు అందిస్తున్న నీటి నాణ్యత తీసి రోజువారి వివరాలు అందించాలని ఆదేశిస్తూ నీటి నాణ్యతను తెలుసుకొనే టిడిఎస్ పరికరాలని ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల డీడీలు, అంబాజీ జాదవ్, రమాదేవి, రమాదేవి ఆర్‌సీఓ, ఏటీడీవోలు, ఏ సీఎం ఓ లు, జీసీడీ ఓ లు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

