Accident | గీతకార్మికుడికి తీవ్ర గాయాలు

Accident | గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
Accident | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురంలో అదే గ్రామానికి చెందిన బీసు సదయ్య(Besu Sadayah) స్థానిక రాముని బండ గుట్ట సమీపంలో ఈ రోజు గీతవృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు(accident) ఒక్క సారిగా మోకు జారడంతో అమాంతం తాటిచెట్టు పై నుండి క్రిందపడడంతో సదయ్య కు తీవ్ర గాయాలయ్యాయి.
కాళ్ళు, మోకాళ్ల కు, నడుములకు(legs, knees, hips) బలమైన గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు మోత్కూర్ లో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స నిర్వహించగా, మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గీతవృత్తి(Geetavrtti)లో తీవ్ర గాయాలైన సదయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించాలని గీత సొసైటీ అధ్యక్షుడు బీసు సత్తయ్య, మాజీ అధ్యక్షుడు బుర్ర యాదయ్య, పెద్ద గౌడ్ బీసు వెంకటయ్య లు డిమాండ్ చేశారు.
