హాస్టల్లో తనిఖీలు..

హాస్టల్లో తనిఖీలు..

బిచ్కుంద, (ఆంధ్రప్రభ)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బీసీ బాలుర హాస్టల్, బీసీ బాలికల హాస్టల్, కాలేజీ హాస్టల్ లో ప్రభుత్వం సప్లై చేస్తున్న పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారా? లేదా? అనే సమాచారాన్ని వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. మీ ప్రభుత్వం మెనూ ప్రకారం వెజిటేబుల్ మీల్స్, సాంబార్ విద్యార్థులకు అందించడం జరుగుతుందని వర్కర్లు అధికారులకు తెలియచేశారు. సాయంత్రం కూరగాయలు, గుడ్డు, పల్లి పట్టిలు, పెరుగు నాణ్యతమైన పదార్థాలు విద్యార్థులకు అందించాలని వర్కర్లకు అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డీ సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఎం శ్రీధర్ రెడ్డి, ఏ ఎస్ ఓ సుదర్శన్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసరావు, డీటీలు సురేష్, కాలిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply