పత్తి రైతులను ఆదుకోవాలి..

పత్తి రైతులను ఆదుకోవాలి..
- పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో- కన్వీనర్ చెల్పూరి రాము
సైదాపూర్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొంథా తుఫాన్(Montha Typhoon) కారణంగా రైతులు నష్టపోయారని ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో- కన్వీనర్ చెల్పూరి రాము డిమాండ్ చేశారు. ఈ రోజు మండలంలోని గర్రెపల్లి, సోమారం, ఎఖాస్ పూర్ గ్రామాలలో పత్తి రైతుల(cotton farmers) సంఘం పర్యటించిన సందర్భంగా రైతు చేతికి పంట వచ్చే సమయంలో అధిక వర్షపాతంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇటీవల తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటలు తడిసిముద్దవుతున్న పత్తి పంటలను పరిశీలించారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓట్ల కోసం ఆరాట పడుతున్నాయి కానీ రైతులను రాజు చేస్తామని కాలం వెల్లదీస్తున్నాయని మండిపడ్డారు. ప్రకృతి వైపల్యాల(natural calamities) వలన చేతికి వచ్చే పంట సర్వనాశనం అవుతుంటే రైతు తీవ్రమైన మనోవేదనకు గురవుతూ ఆత్మహత్య శరణ్యమనే స్థితిలో పడ్డారన్నారు. పత్తి పంట దిగుబడి ఎకరానికి నల్ల రేగడి భూమిలో 15 క్వింటాల వరకు(up to 15 quintals), ఎర్ర భూముల్లో 10 క్వింటాల వరకు రావలసిన దిగుబడి పూర్తిగా తగ్గిపోయి మెంథా తుఫాన్ వచ్చి పంట మొత్తం కొట్టుకపోయాయని కనీసం ఒకటి, రెండు క్వింటాలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈకార్యక్రమంలో పత్తి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుండేటి వాసుదేవ్, రైతులు ఎండి హుస్సేన్, తడ ఓదెలు, మల్లయ్య, సతీష్, భూమయ్యలు పాల్గొన్నారు.
