కౌడిపల్లిలో ఘటన

కౌడిపల్లిలో ఘటన

కౌడిపల్లి, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ) : మెదక్ (Medak) జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివారులో గల పెద్ద చెరువులో శనివారం గుర్తు తెలియని శవం లభ్యమైంద‌ని ఎస్సై మురళి తెలిపారు. కౌడిపల్లి (Kaudipalli) పెద్ద చెరువులో శవం తేలిందని సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలానికి ఎస్సై మురళి చేరుకొని శవాన్ని నీళ్లలోంచి కట్ట పైకి తీయడం జరిగిందన్నారు. శవాన్ని గుర్తించడానికి ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకొని శవాన్ని నరసాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.

Leave a Reply