మహిళ ఆరోగ్యంగా ఉంటే చాలు

మహిళ ఆరోగ్యంగా ఉంటే చాలు
- ఊరు..దేశానికే ఆరోగ్యం
- చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
చిత్తూరు, చిత్తూరు బ్యూరో : ప్రతి మహిళ కుటుంబానికి వెన్నెముక లాంటిదని, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం సుఖ సంతోషాలతో ఉంటుందని చిత్తూరు(Chittoor) ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు(Daggumalla Prasad Rao) అభిప్రాయపడ్డారు. శనివారం చిత్తూరులోని మురుకంబట్టు నందు జీవీజీ కళ్యాణ మండపం(GVG Kalyana Mandapam)లో జి ల్లావైద్య ఆరోగ్య శాఖ, శిశుసంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్(Swasthi Nari Sashakti Parivar Abhiyan) కార్యక్రమాలలో ఆరోగ్యశిబిరాన్నిచిత్తూరు ఎంపీ ప్రారంభించారు. గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో నెలకు రెండు లేక మూడు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సారి ప్రత్యేకతగా దేశ ప్రధానమంత్రి ” స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అలాగే మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుందని అన్నారు.
మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలని అన్నారు. ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు వైద్య శిబిరాలకు వస్తారని అలా కాకుండా ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, గైనిక్ సమస్యలు(Gynecological Problems) రాకుండా ఏమి చర్యలు తీసుకోవాలి, టీబి, మధుమేహ వ్యాధి తదితర రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పూర్వీకులు గతంలో ఆరోగ్యకరమైన రాగి సంకటి, జొన్నసంకటి తదితర ఆహారాన్నితీసుకునేవారని ఆరోగ్యంగా ఉండే వారిని అన్నారు.
ప్రస్తుతం మనలో ఆహార అలవాట్లు మారాయని, కష్టపడడం కూడా తగ్గిపోయిందని, అందువల్ల రోగాలు కూడా పెరిగిపోవడం జరుగుతోందని అన్నారు. మనమందరం మంచి లైఫ్ స్టైల్(Lifestyle)ను అలవాటు చేసుకోవాలని అన్నారు. ఏ రోగాలు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలన్నమెడికల్ క్యాంపు(Medical Camp)ల ద్వారా తెలుసుకోవాలని అన్నారు. మెడికల్ క్యాంపు లందు ప్రివెన్షన్ ఫోకస్(Prevention Focus) చేస్తే బాగుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమాన్నిప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్య చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. చూడ చైర్మన్ కటారి హేమలత(Katari Hemalatha) మాట్లాడుతూ మహిళలందరి ఆరోగ్యం కోసం ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లచే దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేస్తారన్నారు. కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆముద మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నిరంగాలలో అభివృద్ధి సాధించవచ్చున్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సుధారాణి(Dr. Sudharani) మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తేదీ.17.9.2025 నుండి తేదీ. 2.10.2025 వరకు రెండు వారాలపాటు వివిధ ప్రాంతాలలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి, ఎస్పీఎస్ ఎన్ ఏ ప్రోగ్రాం(SPS NA Program) అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, డీ ఐ ఓ డాక్టర్ హనుమంతరావు, ప్రోగ్రాం అధికారులు, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరీ, మాజీ ఎమ్మెల్యే మనోహర్(Manohar), తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దొరబాబు, మొదలియార్ కుల చైర్మన్ త్యాగరాజన్ పాల్గొన్నారు

