బరేలీ/ఘజియాబాద్ : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా గుర్తించిన గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులు ఘజియాబాద్‌లో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో మట్టుబడ్డారు.
పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా, వారు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు మృతిచెందారు. మృతులను అరుణ్, రవీంద్రలుగా గుర్తించారు.
నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు చెందినవారని ధృవీకరించారు. వారిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గ్యాంగ్ ఇతర సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశా పటాని ఇంటి ఎదుట జరిగిన కాల్పుల కేసులో కీలక మలుపు తిరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
దిశా పటాని ఇంటి ఎదుట కాల్పులు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగిన ఘటన తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఆమె నివాసం వద్ద జరిగిన ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు.
ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడి వెనుక కారణంగా దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడం ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించారు.

