హుండీ ఆదాయం రూ. 3కోట్ల,50లక్షలు
మంత్రాలయం, ఆంధ్రప్రభ : ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన(A holy place) మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం(Hundi Collection) రూ. 3,50,17,143 వచ్చినట్లు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ ఎస్.కే. శ్రీనివాసరావు(S.K. Srinivasa Rao) మంగళవారం తెలిపారు.
27 రోజులకు హుండి లెక్కింపును నిర్వహించారు. భక్తులు(devotees) కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయం కరెన్సీ(Currency Income) రూ. 3,39,12,143, నాణెములు 11,05,000 బంగారం(Gold Offerings) 138 గ్రాములు, వెండి(Silver Offerings) 950 గ్రాములు వచ్చినట్లు మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మఠం సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

