ఆర్మీ.. పోలీసు చేతిల్లో!

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశాన్నిరక్షించే ఆర్మీ, చట్టాన్నికాపాడే పోలీసుల(of the police) చేతుల్లోనే తుపాకీ ఉండాల‌ని, అలాకాక పర్మిషన్ లేకుండా ఎవరి చేతిలో తుపాకీ ఉన్నాసంఘ విద్రోహశక్తులుగానే(police and sedition) భావించాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ అన్నారు. ”అందుకే తుపాకీ విడిచి లొంగిపోవాలని కోరుతున్నాం. అలా కాకుండా తుపాకులతో తాము కాలుస్తూ ఉంటాం… మీరు మాత్రం చర్చలకు(talks) పిలవాల్సిందే” అంటే అది పిరికిపంద చర్య అవుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం వందే భారత్ రైలు హాల్టింగ్‌కు పచ్చజెండా ఊపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఉన్నారు.

ప్ర‌ధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అమిత్ షా నాయకత్వంలో 2026 మార్చి నాటికి మావోయిస్టుల(Maoists)ను పూర్తిగా నిర్మూలించి తీరుతాం’’ అని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ఆదివాసి నాయకులను చంపేస్తున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన చిట్టెం నర్సిరెడ్డి(Chittem Narsireddy), శ్రీపాదరావు, రాగ్యానాయక్ సహా ఎంతో మందిని నక్సల్స్ చంపార‌ని ఆయన గుర్తు చేశారు. డ్యూటీ చేస్తున్నపోలీసులను కూడా నక్సల్స్ పొట్టనపెట్టుకుంటున్నారు కదా? పొట్ట కూటి కోసం డ్యూటీ చేస్తున్నవాళ్లను చంపితే మాట్లాడరా..? అని మంత్రి తిరుగుబాటు తిరిగి ప్రశ్నించారు.

రాష్ట్రంలో నెలకొన్నయూరియా కొరత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని సంజ‌య్ దుయ్యబట్టారు. సరైన ప్రణాళిక లేకపోవడం.. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాచర్యలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. గతంలో పంజాబ్(Punjab) పోయి చెక్కులిచ్చి బౌన్స్ చేసి తెలంగాణ పరువును బజారున పడేస్తే.. ఈ కాంగ్రెసోళ్లు టోకెన్ల మీద టోకెన్లు ఇస్తూ మోసం చేస్తున్నరే తప్ప పైసా ఇయ్యడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యూరియా(Uriya) కొరత, రైతుల కష్టాలు వర్ణ‌నాతీతంగా ఉన్నాయని తెలిపారు. రబీ సీజన్‌లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపితే 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మిగిలిందని వివరించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలోని 15 నుండి 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు. గత పదేళ్ల పాటు కేసీఆర్ ఫీజు రీయంబర్స్ మెంట్(Fee Reimbursement) ఇయ్యక తిప్పలు పెట్టారని, ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తామున్నామని ఇన్నాళ్లూ సంకలు గుద్దుకున్నకాంగ్రెసోళ్లు 20 నెలలుగా ఆ బకాయిలియ్యకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ అంశాల్లో గుర్తింపు కార్మిక కేసీఆర్ కు, తమకు తేడా ఏముందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నిఉద్దేశించి విమర్శించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ పై ఆధారపడి యేటా వివిధ కోర్సులు చదువుతున్న15 లక్షల మంది పేద విద్యార్థులకు నాలుగైదేళ్ల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు(Bills) చెల్లించకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ఉందనే ఉద్దేశంతోనే ఉన్నత విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులు నేడు నడిరోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు.. పేద విద్యార్థుల కోసం రూ.8 వేలు కట్టలేరా..? కాలేజీలు బంద్ అయితే విద్యార్థులు ఎటు పోవాలి..? ఏం చదువుకోవాలి..? వాళ్ల భవిష్యత్తు(Future)ను రోడ్డున పడేస్తారా..? అంటూ సంజ‌య్ మండిప‌డ్డారు. ఇదేనా ఇందిరమ్మరాజ్యమంటే.‌.? అని ధ్వజమెత్తారు. పేదోడు తెలంగాణలో బతకాలనే ఆశతో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే ప్రజా సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ ఏమైనా అంటే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం అంటూ రచ్చ చేస్తున్నదని మంత్రి బండి సంజయ్ వాపోయారు.

Leave a Reply