ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిందని కేసు నమోదు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేరళ(Kerala)లోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగి(IT employee)ని కిడ్నాప్ (kidnapped) చేసి, దాడి చేశారన్న కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్ (Lakshmi Menon)తో పాటు మరో ముగ్గురిపై ఎర్నాకులం (Ernakulam) నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు (Police) ఈ చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొచ్చిలోని ఓ రెస్టారెంట్ బార్ (Restaurant Bar)లో బాధితుడి స్నేహితుడితో లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఆ గొడవ అక్కడితో ఆగలేదు. బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లక్ష్మీ మీనన్ బృందం బాధితుడిని వెంబడించి, అతని కారును అడ్డగించింది. అనంతరం అతడిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించారు.
బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన ఎర్నాకులం నార్త్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి లక్ష్మీ మీనన్ స్నేహితులైన మిథున్, అనీశ్, సోనామోల్లను అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన నిందితురాలైన లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
‘కుంకి’, ‘జిగర్తాండ’, ‘వేదాలంస (‘Kunki’, ‘Jigarthanda’, ‘Vedalam) వంటి విజయవంతమైన తమిళ చిత్రాల(Tamil Movies)తో లక్ష్మీ మీనన్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ (Vishal) సరసన నటించిన ‘ఇంద్రుడు’ సినిమాతో తెలుగు(Telugu)లోనూ ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి నటి కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం సినీ వర్గాల్లో (Movies Categories) కలకలం రేపుతోంది.
