ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మంలో లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న అన్నవరపు అంజిరెడ్డి (Annavarapu Anji Reddy) ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా స్థానిక పంపింగ్ వెల్ రోడ్డులో ప్రైవేటు ఎలక్ట్రిషియన్ (Private electrician) గా పనిచేస్తున్న అన్నవరు అంజిరెడ్డి తన ఇంట్లో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయమై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా వేసి బుధవారం దాడి చేసి పట్టుకున్నారు.
స్కానింగ్ పరికరాలు స్వాధీనం..
నిందితుడు అంజిరెడ్డి నుంచి స్కానింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task Force Police) ఖమ్మం త్రీటౌన్ పోలీసు స్టేషన్కు అప్పగించారు. నిందిత్యునిపై పిఎన్డీటీ 1994 చట్ట ప్రకారం పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ టాస్క్ఫోర్స్ ఏసీపీ రవిని, సిబ్బందిని సమర్దంగా నిర్వహించి నిందితుడిని పట్టుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.