HYD | హెలికాప్టర్‌లో మంటలు !

హైదరాబాద్ : మీరుపేట్ మండలం గుర్రంగూడలో ఓ డమ్మీ హెలికాప్టర్‌కు శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడం ఊరటనిచ్చింది.

వివరాల్లోకి వెళితే, కొన్ని నెలల క్రితం సినిమా షూటింగ్ కోసం వినియోగించిన డమ్మీ హెలికాప్టర్‌ను షూటింగ్ అనంతరం అదే స్థలంలో వదిలేశారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ ఆటస్థలంగా మారి, సమీప ప్రాంతాల పిల్లలు, యువకులు అక్కడ సమయం గడుపుతున్నారు.

అయితే శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. సమీపంలోని బోరుబావి నుంచి నీటిని తెచ్చి మంటలను అదుపు చేశారు. అనంత‌రం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటల కారణంపై దర్యాప్తు ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply