రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో లేకపోవడంపై ఆగ్రహం
- చౌటుప్పల్‌లో బీజేపీ నిరసన.. సీఎం ప్రకటన పత్రాల దహనం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఉచిత రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ప్రచురించకపోవడాన్ని నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యంతో పాటు పలు సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరుతో విడుదలైన పత్రికా ప్రకటనల ప్రతులను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేసి దహనం చేశారు.
సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, పట్టణ అధ్యక్షులు కడారి కల్పనా ఐలయ్య యాదవ్, సీనియర్ నాయకులు రమణ గోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, బాతరాజు సత్యం, ఊడుగు వెంకటేశం గౌడ్, కాసుల వెంకటేశం, దిండు భాస్కర్, ఉప్పు ఆంజనేయులు, బడుగు కృష్ణ, వరగంటి భాను ప్రకాష్, వంగాల రమాకాంత్, ఉష్కాగుల నాగరాజు, పర్ని అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
