బిక్కనూర్ ఎంపీడీవోగా సవిత బాధ్యతల స్వీకరణ
మండల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తా: సవిత
బిక్కనూర్, ఆంధ్రప్రభ: బిక్కనూర్ మండల అభివృద్ధి అధికారిగా సవిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి ఎంపీడీవోగా, మండల పంచాయతీ అధికారిగా పనిచేసిన రాజ్‌కిరణ్‌రెడ్డి ఆమె బాధ్యతలు చేపట్టడంతో రిలీవ్ అయ్యారు. తాడ్వాయి మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సవితకు పదోన్నతి కల్పిస్తూ బిక్కనూర్ ఎంపీడీవోగా బదిలీ చేశారు. ఈ మేరకు ఆమె కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
