దాత సహకారంతో విద్యార్థులకు ఐడి కార్డులు..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఐడి కార్డులను అందజేశారు. గ్రామానికి చెందిన పాలెపు ముత్తెన్న సొంతంగా రూ.6 వేలు వెచ్చించి పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు ఐడి కార్డులు చేయించారు.అట్టి ఐడి కార్డ్ లను విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక . గంగాధర్ మాట్లాడుతూ.. 100 మంది విద్యార్థులకు సొంతంగా ఐడి కార్డులు తయారు చేయించి అందించిన దాత పాలెపు ముత్తెన్న కు పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు ఆనంద్,నేల రమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గం,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.