గుంతలమయంగా వేల్పూర్ – ఆర్మూర్ రహదారి
- రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని వేల్పూర్ నుంచి ఆర్మూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు.

రాత్రి వేళల్లో వీధి దీపాలు లేకపోవడంతో గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.”ప్రాణం హరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది. చిన్నపాటి వర్షం పడినా గుంతల్లో నీరు నిలిచి ఇంకా ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్ర వాహనం పడి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు.
