ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్..
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విక్కుర్తి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు అందజేసిన అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తోందని విక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్లను నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు,క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
