కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేముల
చిట్యాల, ఆంధ్రప్రభ : పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆయన కుమారుడు వేముల దిలీప్ శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. శ్రీ కనకదుర్గ అమ్మవారి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత రమేష్, ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
