జైశంకర్‌కు సీఎం విజయ్ లేఖ…
- శ్రీలంక నేవీ అదుపులో 9 మంది భారత మత్స్యకారులు..
- విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
చెన్నై, ఆంధ్రప్రభ : శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన తమిళనాడుకు చెందిన 9 మంది భారత మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. రామనాథపురం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుందని సీఎం విజయ్ తెలిపారు.
వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు.. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మత్స్యకార పడవను కూడా తిరిగి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచూ శ్రీలంక నేవీ చర్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
