శిలాఫలకం ధ్వంసంతో ఉద్రిక్తత..

  • నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు

కాల్వశ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకం గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ శివారులోని మద్దెల వాగు బ్రిడ్జ్ శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరుతో కూడిన శిలా ఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. శిలాఫలకం కూల్చివేతపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.