ఘనంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీ..

  • విద్యార్థులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే, సుజనా చౌదరి..

భవానిపురం, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తీరంగా కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. విజయవాడ, భవానిపురంలో గురువారం హర్ ఘర్ తీరంగా ర్యాలీ కోలాహలంగా సాగింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ ర్యాలీని ప్రారంభించారు.

త్రివర్ణపతాకాలతో, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో విద్యార్థులు , కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా ఉత్సాహంగా ర్యాలీ లో పాల్గొన్నారు. దేశ స్వాతంత్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీయే కూటమి నేతలు, విద్యార్ధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.