క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
కోడూరు, ఆంధ్రప్రభ : క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని రాణీ సంయుక్త అన్నారు. టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోడూరు పెద్ది వారి రామాలయం వద్ద క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 67 మందికి ఎక్సరే తీసారు. క్షయ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుందని, వారాల పైబడి దగ్గు జ్వరం కళ్ళలో రక్తపు చారలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని కోరారు. డాక్టర్ విజయకుమార్, ఏటీఎం శ్రీనివాసరావు, ఎన్ ఎల్ హెచ్ పిలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
