రామ జన్మభూమి ట్రస్ట్‌కు కొత్త సీఈవో ఎవరు?

  • సీఈవో రేసులో 16 మంది..

అయోధ్య, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎంపిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సీఈవో పదవికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల ఇంటర్వ్యూల ప్రక్రియను సెర్చ్‌ కమిటీ పూర్తి చేసింది.

సీఈవో పదవి కోసం మొత్తం 5,585 దరఖాస్తులు అందగా.. వాటిలో నుంచి 16 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశారు. వీరికి నిర్వహించిన ఇంటర్వ్యూల ప్రక్రియ తాజాగా ముగిసింది. ఇక ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను సెర్చ్‌ కమిటీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సమర్పించనుంది. తుది నిర్ణయాన్ని ట్రస్ట్‌ తీసుకోనుంది.