HYD రాత్రంతా వర్షాలే..
హైదరాబాద్ , ఆంధ్రప్రభ : నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 10.30 గంటల సమయంలో మేడ్చల్, షామీర్పేట్, కొంపల్లి, జీడిమెట్ల, దూలపల్లి, దుండిగల్, బొల్లారం, హకీంపేట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి.
రాత్రి 11:15 గంటల వరకు, అలాగే పలు చోట్ల అర్ధరాత్రి వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
