ఆలయ అభివృద్ధికి సహకరించండి..

భవానీపురం, ఆంధ్రప్రభ: చిట్టినగర్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు.

బుధవారం తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు.. నూతన కమిటీ ఏర్పాటుపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరిని దుశ్శాలువతో సత్కరించారు.

ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు రాయన ఆదిబాబు, అధ్యక్షుడు పోతిన భేషు కంటేశ్వరుడు, ఉపాధ్యక్షురాలు తమ్మిన సూర్యకుమారి, కార్యదర్శి తొత్తడి భరత్‌, సంయుక్త కార్యదర్శి పనుకు రమ, పిళ్ల రవీంద్ర, రవి ప్రసాద్‌, బెవర సాయి సుధాకర్‌, నగరాల నాయకులు గుజ్జారీ అమర్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.