క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని వినతి..
భవానిపురం ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని భవానిపురం లోని , దళిత క్రైస్తవులకు సరైన స్మశాన వాటిక లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ బృందం ఎమ్మెల్యే సుజనా చౌదరి ను కలిసి విజ్ఞప్తి చేశారు.
క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చాట్ల రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, సీనియర్ టీడీపీ నాయకులు ఇత్తడి చార్లెస్, పేటేటి రాజా మోహన్, బుదాలనంద కుమారి, దాసరి బుజ్జి, తదితరులు బుధవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ను తాడిగడప లోని క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు.. భవానిపురం లో దళిత క్రైస్తవులకు సరిపడా స్థలం లేక పాత సమాధుల వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనికి పరిష్కారంగా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని అదేవిధంగా క్రిస్టియన్లకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేయడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు.
