Iran-Demands : న‌ష్ట ఫ‌రిహారం Andhra Prabha Top News

Iran-Demands : న‌ష్ట ఫ‌రిహారం Andhra Prabha Top News

  • సైనికుల ఉప‌సంహ‌ర‌ణ‌
  • బ్యాంకు ఖాతాల పునర్జీవ‌నం
  • శాశ్వ‌త యుద్ధ విర‌మ‌ణ‌
  • అప్పుడే హొర్ముజ్ తెరుస్తాం
  • అమెరికాకు ఇరాన్ ఫ‌త్వా

(ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ )

హోర్ముజ్ జ‌ల‌సంధి తాళాల‌ను తెరిపించ‌ట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా .. ఇరాన్‌, ఒమ‌న్ మ‌ధ్య ఒప్పందం కోసం ఆత్రుత‌గా అమెరికా ఎదురు చూస్తున్న వేళ‌,, తాజాగా ఇరాన్ మ‌రో టెన్ష‌న్ తెర‌మీద‌కు తీసుకు వ‌,చ్చింది. హోర్ముజ్ టోల్ గేట్ వ‌సూలు సంగ‌తి స‌రే.. హోర్ముజ్ ను తిరిగి తెర‌వాలంటే..అమెరికా త‌మ‌కు ర‌ష్ట ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని స‌రి కొత్త డిమాండ్ల‌తో ఇరాన్ ఫ‌త్వా జారీ చేసింది. ఈ స్థితిలో అమెరికా ఇంకా స్పందించ‌లేదు.. ఈ స్థితిలో మ‌ధ్య ప్రాచ్యంలో మ‌ళ్లీ ఉత్కంఠ‌త నెల‌కొంది.

Iran-Demands : ఇరాన్ ఫ‌త్వా రిలీజ్

హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ముందు అమెరికా నెరవేర్చాల్సిన డిమాండ్ల జాబితాను ఇరాన్ జాతీయ భద్రతా అధిపతి మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ జారీ చేశారు. సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి జోల్ఘదర్ ఈ డిమాండ్ల జాబితాను ప్రభుత్వ మీడియా ప్రచురించింది. ఈ జాబితాలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయిలి. , సైనిక బలగాలను ఉపసంహరించాలి. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలి. ఈ ఘర్షణతో కలిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి, ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి. ఈ డిమాండ్ల తో జోల్ఘద్ర్ పిలుపునిచ్చారు.
“క్షేత్రస్థాయిలో, వీధుల్లో 160 రోజుల పాటు దృఢంగా నిలబడిన ఇరాన్ ప్రజల డిమాండ్లు ఇవే. వీటిని ప్ర‌జ‌లే గట్టిగా ప్రకటించారు,” అని ఆ ఆయ‌న‌ అన్నారు.
“అమెరికా తన ప్రవర్తనను సరిదిద్దుకునే వరకు, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవరు,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఒమన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ “చాలా దగ్గరగా” ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు.జూన్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని, దానికి పరిహారం చెల్లించడంతో సహా “ఇతర షరతులకు లోబడి” జలసంధిని తిరిగి తెరుస్తార‌ని ఆయన హెచ్చరించారు.
ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్చలను “సానుకూలమైనవి నిర్మాణాత్మకమైనవి”గా అభివర్ణించింది.ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) నివేదిక ప్రకారం, ఇరాన్ చట్టసభ సభ్యులు ఒమన్‌తో ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు, కానీ “తుది ఆమోదం” కోసం వేచి చూస్తున్నారు.