మండలంలో ఎస్‌ఐఆర్ నమోదు 100 శాతం పూర్తి
సమష్టి కృషితో లక్ష్యం సాధించాం: తహసిల్దార్ అనిరుద్
వేల్పూర్, ఆంధ్రప్రభ: వేల్పూర్ మండలంలోని 18 గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తహసిల్దార్ అనిరుద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీపీఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమష్టి కృషితో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ తన తరఫున అభినందనలు తెలిపారు.
జీపీఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటింటికీ తిరిగి అర్హుల వివరాలను నమోదు చేశారని చెప్పారు.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంలో సేవలందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తహసిల్దార్ అనిరుద్ ఆంధ్రప్రభతో పేర్కొన్నారు.
