జగన్మాతను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు సుజాత, సునీత ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.
ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు న్యాయమూర్తులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
