RVM Hospital | అందరికీ అందుబాటులో వైద్యం..

ఆర్‌వీఎం ఆసుపత్రి ప్రత్యేకత
తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవ‌లు
శామీర్‌పేట సమీపంలోని సేవా సంస్థ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలు
ఆరోగ్యశ్రీ సహా పలు పథకాల ద్వారా చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాల వెల్లడి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా శామీర్‌పేట సమీపంలోని వంటిమామిడిలో ఉన్న ఆర్‌వీఎం ఆసుపత్రి సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో సాధారణ వైద్యం నుంచి అత్యాధునిక శస్త్రచికిత్సల వరకు వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం, సాధారణ వైద్యులతో పాటు ఎముకలు, కీళ్లు, కంటి, చెవి–ముక్కు–గొంతు, దంత, చర్మవ్యాధులు తదితర విభాగాల్లో ప్రత్యేక వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని వైద్య సేవలకు ఉచిత సంప్రదింపులు, మరికొన్ని పరీక్షలకు రాయితీ ధరలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన కొన్ని పరీక్షలను కూడా తక్కువ ధరలకు అందిస్తున్నట్లు పేర్కొంది.

ఆసుపత్రిలో గుండె, న్యూరో, యూరాలజీ, గ్యాస్ట్రో, ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్ చికిత్స, సంతానోత్పత్తి కేంద్రం, రక్తనిధి తదితర ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయని యాజమాన్యం తెలిపింది. అత్యవసర వైద్య సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఆసుపత్రిలో చేరిన రోగులకు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపాయి.

అడ్రస్: RVM హాస్పిటల్, సిద్దిపేట జిల్లా శామీర్ పేట మండ‌లం వంటిమామిడి.
జూబ్లీ బస్ స్టేషన్–గజ్వేల్ మార్గంలో ఉన్న ఈ ఆసుపత్రికి ప్రజారవాణా సౌకర్యం ఉందని, ప్రతిరోజూ ఉదయం ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఓపీ టైమ్: ఉదయం 9 నుండి చూస్తారు.. ఇంకా ఎమర్జెన్సీ అయితే 24 గంటలు చూస్తారు..

  1. డాక్టర్ ఫీజు ఎంత అంటే –పూర్తిగా ఉచితం
    జనరల్ ఫిజీషియన్ దగ్గర, కీళ్ల డాక్టర్ దగ్గర, కంటి డాక్టర్ దగ్గర, ENT డాక్టర్ దగ్గర, పంటి డాక్టర్ దగ్గర, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గర – అందరి దగ్గర ఉచితంగా చూపించుకోవచ్చు.
  2. బయట రూ.10,000 అయ్యే టెస్టులు ఇక్కడ రూ.600 లోపే
    CBP: కేవలం ₹ 50/- అదే కార్పొరేట్ హాస్పిటల్ లొ ₹500/- పైనే
    లివర్ & కిడ్నీ టెస్ట్:LFT&RFT. మన RVM హాస్పిటల్ లో ₹350/- అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ₹2000
    ECG + చెస్ట్ X-Ray: ₹180 /-అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ₹700
    థైరాయిడ్ టెస్ట్: ₹200 అదే బయట ₹ 900/-
    మామ్మోగ్రఫీ: ₹300/- అదే బయట ₹4000
    ఒక్కరోజులో ₹6000/- నుఁడి ₹10000/-కు పైగా ఆదా. మరో విషయం : ఇక్కడ CT స్కాన్ కేవలం ₹1000/-
    MRI స్కాన్ కేవలం ₹ 2500/-
    కాన్సర్ కి సంబందించిన PET స్కాన్ కేవలం ₹ 9999/-
  3. 40 ఎకరాల్లో హాస్పిటల్..
    40 ఎకరాల్లో పచ్చదనం మధ్య ఉన్న హాస్పిటల్. గాలి, వెలుతురు, పరిశుభ్రత. బాత్‌రూమ్ నుండి బెడ్ వరకు అద్దంలా మెరుస్తూ ఉంటుంది. క్యాంటీన్‌లో వేడి వేడి అన్నం, కూర, పప్పు, సాంబార్ తో అడ్మిట్ అయినా పేషెంట్ కి భోజనం.. సదుపాయం
  4. వెళ్లడం చాలా ఈజీ – జేబుకు భారం కాదు
    JBS బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ బస్సులు. బస్ టికెట్ ₹30 మాత్రమే. ఆటో అయినా ₹30-₹50. ఉదయం 9 గంటలకు వెళ్తే, టెస్టులతో సహా అన్నీ అయిపోయి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చేస్తారు.