ఎరువుల దుకాణాల్లో తనిఖీలు : ఏవో వెంకన్న
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఎరువుల నిల్వలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ఇన్వాయిస్లు, పిఓఎస్ మిషన్ బ్యాలెన్స్, గోదాము బ్యాలెన్స్, స్టాక్ బోర్డులను తనిఖీ చేయడం జరిగింది. ఈసందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ప్రతి ఎరువుల డీలరు రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్ నిల్వలు పిఓఎస్ నిల్వలు,గోడౌన్ బ్యాలెన్స్ నిల్వలు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
ప్రతి ఎరువుల డీలరు ఎరువుల కంపెనీకి సంబంధించిన ఓ ఫామ్ లను ఎరువుల లైసెన్స్ లో4 పొందుపరచుకోవాలని అదేవిధంగా, కొత్తగా గోదాములను తీసుకున్న ట్లయితే అటువంటి గోదాములను ఎరువుల లైసెన్స్ లో తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. డీలర్లు కనీస మద్దతు ధరకు మాత్రమే ఎరువులను అమ్మాలని, ఎవరైనా డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయించినట్లైతే ఎరువుల నియంత్రణ చట్టం 1985, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా హెచ్చరించారు.
