ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం
బిక్కనూర్, ఆంధ్రప్రభ: ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బిక్కనూర్ పట్టణ సర్పంచ్ రేఖా సుదర్శన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆమె లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం రేఖా సుదర్శన్ మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. మంజూరైన లబ్ధిదారులు సకాలంలో తమ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుండగా, గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సొసైటీ అధ్యక్షులు భూమయ్య, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రవి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, ఉప్పరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
