దేవాలయాల్లో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రంలో రూ.40 లక్షల సీజీఎఫ్ (CGF) నిధులతో నిర్మించనున్న రాజగోపురం, అర్చకుల వసతి గదుల నిర్మాణ పనులకు సోమవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయన శివాలయంలో అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.

అనంతరం బొంపెల్లి గ్రామంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన విజయ రమణారావు.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.