supreme court | జర్నలిస్టులకు సుప్రీం సపోర్ట్
supreme court | జర్నలిస్టులకు సుప్రీం సపోర్ట్
కక్ష్యతో పెట్టే అక్రమ కేసులు చెల్లవ్
supreme court | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పెన్ను పట్టిన, వీడియో కెమెరా పట్టుకుని నిరంతరం సమాజ హితం కోసం, అవినీతి అక్రమాలపై వార్తలు రాసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అక్రమ సంబంధాలు, అవినీతి దందాలు, రాజకీయ కక్షలపై నిజాలను నిర్భయంగా బయటపెట్టే జర్నలిస్టులపై రాజకీయ నాయకులు లేదా ఇతరులు కక్ష్యతో పెట్టే అక్రమ కేసులు చెల్లవని తేల్చి చెప్పింది.
రోజువారీ వార్తలు, ప్రసారాలు నిర్వహించే ప్రింట్ మీడియా, శాటిలైట్ ఛానెల్స్ మరియు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ సిబ్బంది అందరూ జర్నలిస్టుల పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. జర్నలిస్టులపై వచ్చిన ఫిర్యాదు నిజమైనదా లేదా కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన అక్రమ కేసులా అనేది తేల్చే హక్కు ఆయా జర్నలిస్టు సంఘాలకే ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ సంఘాల ద్వారా సమస్య పరిష్కారానికి 7 రోజుల సమయం కేటాయించబడిందని తెలిపింది. ఈ ప్రక్రియను విస్మరించి జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసే పోలీస్ అధికారులపై చర్యలు తప్పవని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.
