Accident | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Accident | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ధమన్‌గావ్ రైల్వే సమీపంలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అతివేగంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
