బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం..
- టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని గౌతమ్ రెడ్డి తండ్రి నాయిని ప్రభాకర్ రెడ్డి,ఏర్పు కొండ ముత్తయ్యలు ఇటీవల మృతి చెందగా,తొర్రూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక వెంకటరెడ్డి సోదరుడు దుబ్బాక లక్ష్మారెడ్డి, సోదరి రాజశ్రీ లు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో వారి స్వగ్రామమైన మరిపెడకు వెళ్లి ఝాన్సీ రెడ్డి సోమవారం వారి కుటుంబాలను సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఏ ఆపద వచ్చిన ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు సకాలంలో చేరే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు చూడాలన్నారు. ఆమె వెంట తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాపల బాపురెడ్డి,పెదగాని సోమయ్య, గంజి విజయపాల్ రెడ్డి,జక్కా మహబూబ్ రెడ్డి,కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,నాయకులు మంగళపల్లి రామచంద్రయ్య, చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్,వాసుదేవా రెడ్డి, యనమల శ్రీనివాస్,ధర్మారపు కిరణ్,నడిగడ్డ మధు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
