కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

ఆలయ మర్యాదలతో స్వాగతం..

అమ్మవారి కి ప్రత్యేక పూజలు…

ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ: ఏపీ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) రంగారావు, వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య మంత్రికి అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందచేశారు.