AP CM | దేశానికి దార్శనిక నాయకుడు పీవీ
AP CM | దేశానికి దార్శనిక నాయకుడు పీవీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
AP CM | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారత అభివృద్ధి దిశను మార్చిన మహానేతగా ఆయన చిరస్మరణీయులు. ఆయన దార్శనిక నాయకత్వం, దేశాభివృద్ధికి చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ మహనీయుడి పుణ్యస్మృతికి మరొకసారి వినమ్ర నివాళులు అని పేర్కొన్నారు.
