చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల పల్స్ పోలియో

చిట్యాల, ఆంధ్రప్రభ : పోలియో రెండు చుక్కలు చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తాయని పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్, చిట్యాల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తెలిపారు.

చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలోని పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రెండు చుక్కలే పిల్లల జీవితానికి బంగారు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

పోలియో చుక్కల ద్వారా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా రక్షణ లభిస్తుందని ఆయన వివరించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.