ఎల్లంపేట్‌లో పల్స్ పోలియో డ్రైవ్

చిన్నారులకు చుక్కలు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ అధికారులు…

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్‌ కృష్ణారెడ్డి తో కలిసి ఆదివారం స్థానిక పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. సమాజాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మున్సిపాలిటీ పరిధిలోని ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. వైద్యారోగ్య శాఖ, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో మున్సిపాలిటీలో ఏ ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా పక్కా ప్రణాళికతో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అర్చన శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీలత రమేష్ యాదవ్, మున్సిపల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్, స్థానిక డాక్టర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.