ఉడుంపూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం..

కడెం, ఆంధ్రప్రభ : దేశ భవిష్యత్తైన ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగడానికి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నాగావత్ సరిత–ప్రభాకర్, ఏఎన్‌ఎంలు గంగామణి, రత్నమాల, ఈజీఎస్ ఎఫ్‌ఏలు రవీందర్, సత్తన్న, ఆశా వర్కర్ లలిత, వార్డు సభ్యుడు పద్మ గంగాధర్, నాయకులు బెడద అంజి, అచ్చె రాజన్న, శ్రీను గౌడ్, బత్తుల చిన్నన్న, అంకతి కేశవ్, జి. శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.