ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మహబూబాబాద్ జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ కవిత పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని పాత జీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని వారు ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి తల్లిదండ్రులు పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సందర్భంగా రెండు మండలాల పరిధిలో 31 పోలియో బూత్‌ల ద్వారా 3,266 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంప్రసాద్, ఉప సర్పంచ్ కాస యాకయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
