నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం..

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి చిన్మయి సాయి రూ.1,00,116/- విరాళము శనివారం అందజేశారు. ఈ విరాళమును ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ ఆలయ అర్చక స్వాముల సమక్షంలో అందజేయగా వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.

అనంతరం వేద పండితులు వేదాసి రచనం చేయగా పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదం రసీదులను అందజేశారు.