పిసిసి కార్యదర్శి పరామర్శించిన నాయకులు..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని శనివారం పలువురు నాయకులు పరామర్శించారు. ఇటీవల ఆయన మోకాళ్ల శాస్త్ర చికిత్సలు చేయించుకుని ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న నాయకులు ఆయన వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని నాయకులు ఆకాంక్షించారు. ఆయన పరామర్శించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు దేవరాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి మంద రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ ఆనంద్, ప్రముఖ వ్యాపారి అల్లాడి రమేష్ తదితరులు ఉన్నారు.