అభివృద్దిలో ముందుకు సాగుతున్న నర్సింహులపేట
అభివృద్దిలో ముందుకు సాగుతున్న నర్సింహులపేట
రోడ్డు విస్తరణతో మండల కేంద్రానికి మహర్దశ
సహకరించాలాంటున్న సర్పంచ్ పెదమాముల యాకయ్య
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట మండల కేంద్ర అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న బై పాస్ రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య కోరారు.శుక్రవారం మండల కేంద్రంలో పొట్టి శ్రీరాములు బజార్ నుండి ఇందిరాగాంధీ బొమ్మవరకు బై పాస్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి కూల్చి వేతలను చేపట్టారు.తొలగించని వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న మండల కేంద్ర జనాభాతో పాటు రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని బైపాస్ గా పొట్టి శ్రీరాములు బజార్ నుండి ఇందిరాగాంధీ బొమ్మవరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.రహదారికి ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రహదారి విస్తరణకు సహకరించాలని కోరారు.పెరుగుతున్న వాహన రద్దీతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఇరుకు రోడ్డు సమస్యతో విసిగిపోతున్నారని ప్రజల అభిప్రాయాల మేరకే రహదారి విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు.
రూ.10లక్షల ఎస్ డి ఎఫ్ నిధులు వెచ్చించి సీసీ రోడ్డు నిర్మాణం,మిగతావి గ్రామ పంచాయతీ నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణం,రాంజీ రామ్ ఉపాధి నిధులు రూ.50లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు రైతు వేదిక,ఇతర బజార్ లలో ఇప్పటికే మట్టి పోసి రోడ్డు లోలర్లతో ఫార్మేషన్ చేస్తున్నట్లు తెలిపారు.మండల కేంద్ర అభివృద్ధికి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కృషి తో ముందు సాగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్,లోక్యతండా సర్పంచ్ రాజేందర్,ఉప సర్పంచ్ కాస యాకయ్య,వార్డు సభ్యులు కొంపెల్లి యాకన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్ర రవి తదితరులు ఉన్నారు.
