పలు గ్రామాల్లో ఘనంగా మొహరం వేడుకలు…

బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట, చిన్న రామన్ చర్ల, కేసిరెడ్డిపల్లి, కట్కూర్, విఎస్ఆర్ నగర్, కొడవటూరు, నాగిరెడ్డిపల్లి, ఇటికాల పల్లి, బచ్చన్నపేట, బండ నాగారం, బసిరెడ్డిపల్లి, పలు గ్రామాలలో మొహరం పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలు వేడుకల్లో పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. పీరీలను రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్ది గ్రామ పురవీధులలో ఇంటింటా తిరుగుతూ ఘనంగా ఊరేగిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొనగా, వేడుకలు కనుల పండుగగా సాగాయి. సందర్భంగా పోచన్నపేట కార్యక్రమంలో భీమగోని రాములు గౌడ్, ఉప్పయ్య , ఉమేష్, కనకయ్య , హరీష్ , మధు , శివాజీ, రవి, రాజు, సన్నీ ,భాస్కర్, సిద్ధులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.