రైతులు సన్న రకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..

రైతులు సన్న రకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..

  • యూరియా అందుబాటులోనే ఉంది..
  • రైతులు అధైర్య పడదు..
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ విప్ విజయరమణారావు

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్నలు సన్న రకానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం అందించే బోనస్ను పొందాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం రైతుల శ్రేయస్ కోసం శ్రమిస్తున్నారని సన్న రకాలను పండించి బోనస్ పొందాలని సూచించారు. గతంలో ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం రైతు శ్రేయస్ కోసమే పనిచేస్తుందన్నారు. విత్తన మేళాలో, రైతుల శ్రేయస్సు కోసం పలు ముఖ్య మైన విషయాలు వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వరి సన్న రకాలు 23 నుండి 30 వరకు ప్రతీ రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

రైతులకు అందించాల్సిన యూరియా సమృద్ధిగా ఉందని రైతులెవరు అధైర్యపడవద్దని వివరించారు. శాస్త్ర వేత్తలు, వాతావరణ నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో ఎల్సీనో ప్రభావం అధికంగా ఉంటుందని, తగినంత వర్షపాతం పడిన తర్వాతనే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకాలను సాగు చేస్తేనే క్వింటాల్కు 500 బోనస్ లభిస్తుందని, జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు తప్పనిసరిగా సాగులో నానో ఎరువులు విరివిగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, ఇతర గ్రామ సర్పంచ్ లు, జిల్లా వ్యవసాయ అధికరి శ్రీనివాస్, ఏవో పైడితల్లి, మండల ఏఈవోలు రాజు, పద్మ, అనుష, రవితేజ, ఆనంద్ రావు, విత్తన లెసైన్సు కలిగిన డీలర్స్, రైతులు పాల్గొన్నారు.