మాధాపూర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మాధాపూర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

గ్రామ సమస్యల పరిష్కారానికి మంత్రికి సర్పంచ్ వినతి

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : మండలంలోని మాధాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ షేక్ ఇమ్రాన్ షాదుల్లా శనివారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు.

గ్రామానికి అత్యవసరంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, గ్రామపంచాయతీ భవనం, హెల్త్ సబ్ సెంటర్ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మాధాపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామ అభివృద్ధి అంశాలపై సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *