Dandepalle వెల్గనూర్‌లో బడిబాట కార్యక్రమం
Dandepalle వెల్గనూర్‌లో బడిబాట కార్యక్రమం
దండేపల్లి (Dandepalle), ఆంధ్రప్రభ: మండలంలోని వెల్గనూర్ గ్రామంలో గురువారం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల వివరాలు సేకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, పాఠశాల సాధిస్తున్న ఫలితాలను వివరించి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, బొలిశెట్టి రాజన్న, ఉపాధ్యాయులు రజిని, వేణుగోపాల్, ప్రవీణ్, గంగన్న, పద్మావతి, రమాదేవి, వీణ తదితరులు పాల్గొన్నారు.
